Header Banner

విజయవాడ బీసెంట్ రోడ్‌లో బాంబు కలకలం! భద్రతా బలగాల హై అలర్ట్!

  Sat May 24, 2025 15:40        India

నగరంలో బాంబు కలకలం రేగింది. బీసెంట్ రోడ్‌కు (Besant Road) బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్‌ రోడ్‌లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో నేటి మధ్యాహ్నం నుంచి యధావిధిగా బీసెంట్ రోడ్‌లో వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాగే కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్‌లో నిత్యం వేలాది మంది జనసంచారం ఉంటుంది. వందలాది షాపులు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అయితే ఈరోజు 9:30 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్‌ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి.. విజయవాడ బీసెంట్ రోడ్డులో బాంబులు పెట్టామని, మరికాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి బందర్‌ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బీసెంట్‌ రోడ్డులు షాపులతో పాటు, తోపుడ బండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతీ బండిని బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేసింది.

అయితే బాంబు ఉన్నట్టు ఎటువంటి ఆనవాళ్లు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో రెండు గంటల పాటు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసే అవకాశం ఉంది. బాంబు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్డులో అన్ని షాపులను మూసి వేయించడంతో పాటు ఈ రోడ్డులో సామాన్య ప్రజలు, వ్యాపారులను ఎవరినీ కూడా రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీసెంట్ రోడ్డులో భారీగా బందోబస్తును కల్పించారు. తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు ముగిసిన తర్వాత బాంబు కాల్‌పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Vijayawada #BombScare #BesantRoadAlert #HighAlert #PoliceAction #BombThreat #SecurityTightened